Breaking News

మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి : చిదంబరం

26 th Sep 2020, UTC

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ "భారత రత్న"అవార్డు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం డిమాండ్ చేశారు. ఆయన 88 వ పుట్టినరోజు రానున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. "నేడు మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు మంచి ఆరోగ్యంతో మరికొంత కాలం పాటు ఆయన దేశానికీ సేవ చేయాలనీ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన జీవితమంతా వినయపూర్వకంగా సాగింది. విద్యార్హతలు, మేధో సంపత్తితోనే ఆయన ఎంతో ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. దేశం మొత్తానికి ఆయన ఓ రోల్ మోడల్. జీవించి ఉన్న వారిలో ఎవరైనా భారత రత్నకు అర్హులంటే నిస్సందేహంగా మన్మోహన్ సింగే" అని చిదంబరం ట్విట్టర్ మాధ్యమం గా పోస్ట్ చేసారు.

నేడు మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ మాధ్యమంగా శుభాకాంక్షలు తెలిపారు. "మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు మనకు చాలా తక్కువమంది కనిపిస్తారని" రాహుల్ అన్నారు. అతని నిజాయితీ, సహనం మనకు ప్రేరణను ఇస్తాయని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు " భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నానని" మోడీ ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox