Breaking News

గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్  కన్నుమూత

29 th Oct 2020, UTC

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ ఈరోజు తన 92వ ఏట గుండెపోటుతో కన్నుమూశారు. గుజరాత్‌కు 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు మొదటి పర్యాయం, 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001లో గుజరాత్‌లో జరిగిన ఉపఎన్నికలలో బీజేపీకి ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. దీంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని కేశూభాయ్ పటేల్‌పై ఒత్తిడి రావడంతో పదవి నుంచి తప్పుకోగా  ఆ స్దానంలో నరేంద్ర మోదీ సీఎంగా వచ్చారు.

కేశుభాయ్ పటేల్ ఆరుసార్లు గుజరాత్ శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2012 లో బిజెపి నుంచి వైదొలిగిన  పటేల్ గుజరాత్ పరివర్తన్ పార్టీని స్దాపించారు. అయితే 2012 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ దారుణ పరాజయంతో 2014లో బిజెపిలో విలీనం చేశారు.1928 లో జునాగడ్ జిల్లాలోని విసావదర్ పట్టణంలో జన్మించిన పటేల్ 1945 లో రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జనసంఘ్ తరపున రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox