Breaking News

మహారాష్ట్ర సంకీర్ణ కూటమిలో సీట్ల పంచాయతీ..!

15 th Jun 2020, UTC

మహారాష్ట్రలోని అధికారంలో వున్న సంకీర్ణ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. 12 విధాన పరిషత్ సీట్ల ను. ఏ ప్రాతిపదికన పంచుకోవాలనే విషయంలో గతంలో అంగీకరించిన దానికి భిన్నంగా తమకు సీట్లు ఆఫర్ చేయడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సోమవారంనాడు సమావేశం కావడానికి కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం, 12 విధానసభ సీట్లకు గాను శివసేనకు 5 సీట్లు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 4, కాంగ్రెస్‌కు 3 సీట్లు దక్కనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం సమాన ప్రాతిపదికగా సీట్లు ఇవ్వాలని, ఒక్కో పార్టీకి 4 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది.

సోమవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ చెప్పారు.మహారాష్ట్రలో కాంగ్రెస్‌-శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మంత్రి అశోక్‌ చవాన్‌ అంగీకరించారు. విభేదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కావాలని కాంగ్రెస్‌ కోరుతోందని చెప్పారు. మరో రెండు రోజుల్లో సీఎం కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహావికాస్‌ అగడి భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అంశాలున్నాయని, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు తాము సీఎంతో రెండు రోజుల్లో భేటీ అవుతామని అశోక్‌ చవాన్‌ చెప్పారు.

గత నెలలో కూడా కూటమిలో విభేదాలు తలెత్తినట్టు ఊహాగానాలు వచ్చాయి. గవర్నర్, ముఖ్యమంత్రిని శరద్ పవార్ కలవడం, రాహుల్ గాంధీ చేసిన ఓ కామెంట్‌ ఈ ఊహాగానాలకు తావిచ్చాయి. 'మహారాష్ట్రలో ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం. కీలక నిర్ణయాధికారులు తీసుకోవడం లేదు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పుదుచ్చేరిలో మేమే కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభుత్వం నడపడానికి, మద్దతు ఇవ్వడానికి మధ్య తేదా ఉంది'  అని రాహుల్ గాంధీ అన్నారు.

 మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయత్నిస్తున్నారనే ఆందోళనలను పవార్ కొట్టివేసారు. ఇదే సమయంలో అధికార కూటమిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కరోనాతో పోరాటంలో ప్రజలు సతమతమవుతుంటే, అధికార కూటమి మాత్రం కేవలం అధికారం నిలుపుకోవడానికే తహతహలాడుతోందని బీజేపీ నేత రాందాస్ కదమ్ విమర్శించారు.

కీలక సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు ఆహ్వానం అందడం లేదని కొంతకాలంగా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి సహా పలు అంశాలపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పలుమార్లు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమవుతుండగా ఈ భేటీలకు కాంగ్రెస్‌ నేతలను పిలవకపోవడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశంతో పాటు గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేషన్లు, నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ బాలాసాహెబ్‌ థోరట్‌, అశోక్‌ చవాన్‌లు సోమవారం ఉద్ధవ్‌ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox