Breaking News

రోష్ని కుంభకో్ణంలో ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలు

24 th Nov 2020, UTC

జమ్మూకశ్మీర్ :చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి జాబితాలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా పేర్లను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం చేర్చింది.జమ్మూకశ్మీర్ అధికార యత్రాంగం తయారు చేసిన రోష్ని కుంభకోణం జాబితాలో తమ పేర్లు ఉండడంపై ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తన ఒక్కడి ఇల్లే కాదని, ఆ ప్రాంతంలో వందలాది ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై తాను మాట్లాడబోనని, తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. 

నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత దేవేందర్ రాణా మాట్లాడుతూ.. 2001లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వమే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని సవరించాయన్నారు. భూమిని లీజుకు తీసుకుని ఎన్‌సీ కార్యాలయాన్ని నిర్మించామని, ఆ తర్వాత రోష్ని చట్టం కింద రెగ్యులరైజ్ చేయించామని తెలిపారు. అందులో తప్పేమీ లేదని సీబీఐ విచారణ చేసుకోవచ్చన్నారు.

రోష్ని పథకం కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైన కేసులో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇటీవల సీబీఐ విచారణకు ఆదేశించింది. రోష్నీ పథకంలో అక్రమాలపై సీబీఐ మూడు వేర్వేరు కేసులు నమోదు చేసింది. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox