Breaking News

IES examination: రైతు కొడుకు, ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ లో రెండవ ర్యాంకర్

01 st Aug 2021, UTC

Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన రైతు కుమారుడు తన్వీర్ అహ్మద్ ఖాన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యూపీఎస్సీ ) నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ( ఐఈఎస్ ) పరీక్షలో రెండవ ర్యాంక్ సాధించాడు.

దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిగీన్‌పోరా కుండ్ గ్రామానికి చెందిన ఖాన్ కుండ్, వాల్టెంగూ లో విద్యాభ్యాసం చేసారు. అనంతనాగ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసారు. కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందారు. అనంతరం కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ చేసారు.

లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించి కష్టపడితే ఏదీ అసాధ్యం కాదని పలితం దక్కుతుందని ఖాన్ చెబుతారు. కోవిడ్ కాలంలో, నేను నా గది నాలుగు గోడలకే పరిమితమయ్యాను. ఎంఫిల్ చేస్తూనే ఐఈఎస్ పరీక్షకు సిద్ధమయ్యాను అని ఆయన తెలిపారు. తన తొలి ప్రయత్నంలోనే  ఈ ఘనత సాధించిన  ఖాన్, ఇది కష్టమైన పోరాటం అని వ్యాఖ్యానించారు. నేను చాలా కష్టపడ్డాను మరియు నా మొదటి ప్రయత్నాన్ని నా చివరి ప్రయత్నంగా భావించాను మరియు చివరికి నేను ఈ ఘనతను సాధించాను" అని అతను చెప్పారు. విద్యా సంస్కరణలను ప్రారంభించినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రాథమిక విద్యా వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. కశ్మీర్ యువత ప్రతి రంగంలో రాణించగల తెలివైనవారు. అయితే వారు సంప్రదాయక కోర్సులకు భిన్నంగా ప్రత్యుమ్నాయ కోర్సులను ఎంపిక చేసుకోవాలని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇండియన్ ఎకనమిక్ సర్వీస్  పరీక్షలో రెండవ ర్యాంకు సాధించినందుకు ఖాన్‌ను అభినందించారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox