Breaking News

కరోనా బాధితుల కోసం ..!

29 th Jun 2020, UTC
కరోనా బాధితుల కోసం ..!
దేశ రాజధాని ఢిల్లీ లో కూడా కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి అదుపుతప్పి విచ్చల విడిగా మానవాళి ని బాధిస్తోంది. అయితే.. ప్రస్తుతానికి.. ఈ మహమ్మారి సోకినా రోగుల కు చికిత్స విషయం లో కూడా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.. పౌష్టికాహారం అందించడమే కాకుండా.. వారికీ వైరల్ డ్రగ్ లను అందిస్తూ చికిత్స చేస్తున్నారు.. ఐతే.. రోగ నిరోధక శక్తీ ఎక్కువ ఉన్న వారికి వేగం గానే నయమవుతుంది. 
 
              ప్రస్తుతం వీరినుంచి సేకరించిన ప్లాస్మా మిగిలిన రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగం అవుతుంది.. కరోనా చికిత్స లో ప్లాస్మా థెరపీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకోసం ఢిల్లీ లో ప్లాస్మా బ్యాంకు ను ఏర్పాటు చేస్తునట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో.. ఈ ప్లాస్మా బ్యాంకు ఆపరేషన్ ప్రారంభం కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన "కరోనా" నుంచి కోలుకున్న రోగులు "ప్లాస్మా"ను దానం చేయాలని కోరారు. "కరోనా" కారణంగా ఇటీవల, ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి సీనియర్ డాక్టర్ అసీమ్ గుప్తా మరణించారు. కాగా.. ఆయన మృతి కి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రగాఢ సంతాపం తెలిపారు. 
 
               ఆయన లాంటి వారి వల్లే మనం కరోనా మహమ్మారి తో పోరాడగలుగుతున్నామని అన్నారు. ఆ తరువాత.. డాక్టర్  అసీమ్ గుప్తా  కుటుంబానికి  కోటి రూపాయలను పరిహారం గా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు.. ఢిల్లీ లో పెరుగుతున్న కరోనా కేసుల విషయం లో కూడా అప్రమత్తం గా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 80వేలు దాటింది. కేసుల సంఖ్య పెరగటంతో పాటు ఢిల్లీలో మృతులసంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox