దేశ రాజధానిలో కరోనా కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఢిల్లీలో కోవిడ్ టెస్టులను రెట్టింపు చేస్తామని, ఆరు రోజుల్లో కరోనా టెస్టుల సామర్ధ్యం మూడింతలు చేస్తామన్నారు. ఢిల్లీలో కోవిడ్-19 కట్టడి చర్యలపై హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్దాయి సమావేశం జరిగింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని హోంమంత్రి తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంట్లో సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. ఆ జోన్లలో ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహించాలని చెప్పారు.
పోలింగ్ స్టేషన్ పరిధిలో కరోనా పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు హోంమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు బెడ్ల కోసం 500 రైల్వే కోచ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కోవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించిన నూతన గైడ్‌లైన్స్ రూపొందిస్తామన్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమిస్తామని అన్నారు. కరోనాపై పోరులో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల సేవలు వాడుకుంటామని అమిత్ షా చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు 60 శాతం బెడ్లు తక్కువ ధరకే ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా చికిత్స, టెస్టింగ్ ధరలపై డాక్టర్ పాల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు హోమంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రితో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అత్యంత నిర్మాణాత్మక సమావేశం. చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కేంద్రం, రాష్ట్రం ఉమ్మడిగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటాం అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీలోని ఆస్పత్రులన్నింటినీ కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించాలన్న డిమాండ్‌ను కేజ్రీవాల్ కేంద్రం ముందు పెట్టినట్లు సమాచారం. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు, పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతుల కల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల వసూళ్లపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అమిత్‌షా వారికి హామీ ఇచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించేలా చూడాలని, అయితే టెస్టుల కోసం విధించే రేట్లను మాత్రం కేంద్రం సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం కేజ్రీవాల్ హోంమంత్రి అమిత్‌షాతో చెప్పారు.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
19 Jan 2021