Breaking News

బెంగాల్ పై విరుచుకు పడ్డ జేపీ నడ్డా..!

06 th Jul 2020, UTC
బెంగాల్ పై విరుచుకు పడ్డ జేపీ నడ్డా..!

పశ్చిమబెంగాల్ లో కరోనా కేసుల కంటే నేరగ్రస్థ రాజకీయాలు, అవినీతి ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీలో నడ్డా సోమవారం మాట్లాడుతూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను మోదీ, ఆయన ప్రభుత్వం రద్దు చేసిన తరుణంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి జరుపుకోవడం సంతోషమన్నారు.

 370వ అధికరణ కింద జమ్మూకశ్మీర్‌కు ఎందుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రశ్నించారని, అయితే నెహ్రూ, షేక్ అబ్దుల్లా మైండ్‌ పాలిటిక్స్‌‌ వల్లే నెహ్రూ స్వయం ప్రతిపత్తికి అంగీకరించారని నడ్డా పేర్కొన్నారు.

ఒక వైపు ఐక్య భారతం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాడితే, మరోవైపు ఏం చేసైనా సరే నా అధికారం నిలుపుకోవాలని బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం తహతహలాడుతోందని నడ్డా విమర్శించారు. అక్కడ నేరగ్రస్థ రాజకీయాలు సరికొత్త హైట్స్‌కు చేరాయని, బెంగాల్‌లో కట్ మనీ (ప్రభుత్వ పథకాల పేరు చెప్పి మామూళ్లు వసూలు చేయడం) గురించి ఇప్పుడు అందరూ వింటున్నారని ఎద్దేవా చేశారు. కట్ మనీ అడిగే నాయకుల తోకలు కత్తిరించాలని, బెంగాల్ గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం మనపై ఉందని అన్నారు. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డాలని నడ్డా సూచించారు.

సహకార సమాఖ్యపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి నమ్మకం లేదని, కేంద్రంతో కోవిడ్ డేటా పంచుకునే విషయంలోనూ ఆమె ఆసక్తి చూపలేదని ఆయన ఆరోపించారు. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు, ప్రయత్నాల వల్లే పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో భారత్‌తో ఉన్నాయని నడ్డా పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox