Breaking News

ఒక్కరోజే పదివేల కరోనా కేసులు..భారత్ లో మహమ్మారి భీబత్సం..!

07 th Jun 2020, UTC

భారత్ లో  ప్రతీరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు పదివేల కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 9971 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న మొన్నటివరకు మరణాల రేటు తక్కువగా వుంది.
         అయితే.. ప్రస్తుతం కరోనా మరణాలుకూడా పెరుగుతుండడం అధికారుల్లో ఆందోళనను కలిగిస్తోంది. 24 గంటల్లో 287 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6929కి చేరింది. ఇప్పటి వరకూ 1,19,292 మంది కోలుకోగా మరో 1,20,406 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి ఎక్కువ మంది కోలుకుంటున్నారు. కానీ.. కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం తో.. ఆందోళన పెరుగుతోంది. తాజాగా నమోదైన కేసులతో భారత్ స్పెయిన్ ను దాటి ఐదవ స్థానానికి వచ్చింది. అటు, కరోనా మరణాల విషయంలో భారత్ 12వ స్థానంలో ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox