Breaking News

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు..!

09 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి భారత్ లో విలయ తాండవం సృష్టిస్తోంది. చిన్న పెద్ద.. పేద..ధనిక.. సామాన్యులు.. సెలెబ్రిటీలు..రాజకీయ ప్రముఖులు ఎవరిని వదలడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా.. ముప్పు ఎటునుంచి వచ్చి కబళిస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.. చాల మంది లో లక్షణాలు కూడా కనబడకపోవడం తో.. ఈ వ్యాధి ఉందొ లేదో తెలియడం లేదు. కంటికి కనిపించని ఈ మహమ్మారి తో పోరాడటానికి ప్రభుత్వం, వైద్యులు, పోలీసులు తీవ్రం గా శ్రమిస్తున్నారు. ఈ మహమ్మారి  ని పారద్రోలడానికి నిత్య యజ్ఞం సాగుతోంది. ఈ నేపధ్యం లో .వైద్యులు...పొలిసులు.. ప్రభుత్వ అధికారులు కూడా కరోనా బారిన పడుతుంన్నారు.
 
       తాజాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా లక్షణాలతో బాధపడుతున్న సంగతి  తెలిసిందే. గత రెండు రోజులు గా ఆయన కరోనా లక్షణాలైన..దగ్గు, జలుబు, గొంతు నొప్పివంటి లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే.. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆయన క్వారంటైన్ లో కి వెళ్లారు. ఇందులో భాగంగా ఇవాళ(జూన్ 9,2020) కేజ్రీవాల్ కు కరోనా నిర్ణారణ పరీక్షలు చేశారు. వైద్యులు ఆయన వద్ద నుంచి సాంపిల్స్ ను తీసుకున్నారు.
 
        వాటిని ల్యాబ్ కి పంపారు. రిపోర్టు రావాల్సి ఉంది. రిపోర్టులో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సోమవారం(జూన్ 8,2020) అస్వస్థతకు గురవడంతో సీఎం కేజ్రీవాల్ సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మన దేశం లో ఢిల్లీ  లో కూడా కేసులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. పాజిటివ్‌ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 28వేల 936 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox