కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తూ పోతోంది.. లాక్ డౌన్ సడలింపులివ్వడం... కరోనా టెస్ట్ లను పెంచడం తో.. భారత దేశం లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఊహించని రీతిలో... తక్కువ కాలం లోనే ఎక్కువ వేగం గా వ్యాప్తి చెందుతోంది. కేవలం పదిహేను రోజుల గడువు లో లక్ష కు పైగా కేసులు నమోదవడం అధికారుల్లో ఆందోళనను కలిగిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ప్రకారం పరిశీలిస్తే, ఈ వారంలోనే మనకన్నా ముందున్న ఇటలీ, స్పెయిన్ లను అధిగమిస్తుందని, ఆపై మరికొన్ని రోజుల్లోనే యూకేను అధిగమించి 4వ స్థానానికి చేరుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం.. ఈ మహమ్మారి కేసుల్లో అగ్రస్థానం లో అగ్ర రాజ్యం అమెరికా నే ఉంది.అమెరికా లో కేసులు పెరగడం ప్రస్తుతానికి నెమ్మదించినా..భారత్ లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. చివరికి యూరప్ దేశాల్లో కూడా కొత్త గా కేసులు నమోదు కావడం లేదు. ఇండియాలో ప్రస్తుతం ప్రతి 15 రోజులకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అంటే, ప్రస్తుతమున్న కేసుల సంఖ్య 2.16 లక్షల కేసులు, ఈ నెల 20వ తేదీకి సుమారు 4 లక్షలను దాటి పోతాయి. ఆపై రెండు వారాలకు.. ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మరో వైపు.. ఇండియా లో కరోనా పరీక్షలు తక్కువ గా చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా మాదిరిగా ప్రతి 10 లక్షల మందిలో 2 వేల మందికి పరీక్షలు చేస్తే, భారత్ లో ఎన్ని కేసులు బయటపడతాయో ఊహించడానికి భయంకరమైన వాస్తవం అది..