Breaking News

తగ్గుతున్న కరోనా పాజిటివ్ రేటు.. !

06 th Jul 2020, UTC
తగ్గుతున్న కరోనా పాజిటివ్ రేటు.. !
              భారత్ లో కరోనా మహమ్మారి కేసులు గణనీయం గా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే. కొంతలో కొంత నయమెంటంటే.. ఇప్పటి వరకు భారత్ లో ఇతర దేశాల తో పోలిస్తే.. మరణాల రేటు తక్కువ గా ఉంది. అయితే.. కేసులు ఎక్కువ సంఖ్యా లో నమోదు అయినప్పటికీ.. రికవరీ రేటు ఎక్కువ గా ఉండడం తో.. కరోనా సోకినా వ్యక్తులు త్వరగా కోలుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు.. తాజాగా జరిగిన సర్వే లో కరోనా పాజిటివ్ రేటు కూడా తగ్గుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.. పాజిటివ్ కేసుల సంఖ్యా కన్నా.. కరోనా సోకి రికవర్ అయి.. డిశ్చార్జ్ అయిపోయిన వారి సంఖ్యా ఎక్కువ గా ఉంది.. ఇది శుభ పరిణామం.. 
               కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కోవిడ్-19 మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో దేశంలో కరోనా-19 పాజిటివ్ రేటు తగ్గింది. ప్రస్తుతం.. భారత్ లో కరోనా పాజిటివ్ రేటు 6.73 గా ఉంది. ఈ విషయాన్నీ.. నేడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  ప్రకటించింది. ప్రతి పది లక్షల మంది జనాభాలో 6,858 మందికి టెస్టులు  చేసినట్లు ఈ శాఖ తెలిపింది. ప్రస్తుతం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జూలై 5వ తేదీ నాటికి కరోనా పాజిటివ్ రేటు జాతీయ స్థాయిలో యావరేజ్ కంటే తక్కువగా ఉందని తెలిపింది. పాండిచ్చేరిలో కరోనా పాజిటివ్ రేటు 5.55 శాతం ఉండగా, ఛండీగఢ్‌లో 4.36, అసోంలో 2.84 శాతం, త్రిపురలో  2.72 శాతంగా. కర్ణాటకలో 2.64 శాతం, రాజస్థాన్‌లో 2.51 శాతంగా ఉంది.
              దేశ  రాజధాని ఢిల్లీ లో.. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం తో.. కరోనా టెస్ట్ ల సంఖ్యా పెరిగింది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టింగులు, ర్యాపిడ్ యాంటిజిన్ పాయింట్ ఆఫ్ కేర్ (పీఓసీ) టెస్టులుతో పరీక్షలు  కూడా ఎక్కువ సంఖ్యా లో జరుగుతున్నాయి. కేవలం అరగంట లోనే ఫలితాలు వచ్చే విధం గా ఏర్పాట్లు చేస్తున్నారు.  జూన్ 1-5 మధ్య రోజుకు యావరేజ్‌గా 5,481 కేసుల టెస్టింగ్ జరుగగా, అది జూలై 1-5 మధ్య 18,766కు చేరింది.  ఢిల్లీ లో కరోనా పరీక్షలు పెరిగిన తరువాత.. పాజిటివ్ రేటు గత మూడు వారాలలో పది శాతం తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox