Breaking News

లాక్ డౌన్ లో దినసరి కార్మికులకు నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టం..!

04 th Jun 2020, UTC
లాక్ డౌన్ లో దినసరి కార్మికులకు  నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టం..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో దాదాపు 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. .దేశంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు రెండు నెలల పాటు దినసరి కార్మికులు ఉపాధి కోల్పోవడం వల్ల నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని, ఇది భారత జీడీపీలో రెండు నుంచి మూడు శాతమని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీలో ఎకనామిక్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న జయన్‌ జోస్‌ థామస్‌ తెలిపారు.


‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ 2018, ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం పురుషుల సగటు వేతన రోజుకు 282 రూపాయలు, మహిళల సగటు వేతనం రోజుకు 179 రూపాయలని ఆయన చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల వేతనం, మగవారికి నెలకు సరాసరి సగటు 14,024కాగా, మహిళలకు 9,895 రూపాయలని, అదే పట్టణ ప్రాంతాల్లో పురుషులకు 18,353 రూపాయలుకాగా, మహిళలకు 14,487 రూపాయలని థామస్‌ చెప్పారు.

ఈ లెక్కన రెండు నెలల కాలానికి కార్మికులు కనీసం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉపాధి కింద నష్టపోయారని ఆయన అంచనా వేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox