Breaking News

కొత్త ఎటిఎం లు.. ఇకపై డబ్బులకోసం టచ్ చేయకండి...!

05 th Jun 2020, UTC
కొత్త ఎటిఎం లు.. ఇకపై డబ్బులకోసం టచ్ చేయకండి...!
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యం లో... ఎటిఎం లోకి వెళ్లి డబ్బులు తెచ్చుకోవడానికి కూడా ఆలోచించాల్సి వస్తోంది. నిత్యం వందలాది మంది వస్తూ పోతూ ఉండే ఎటిఎం వద్ద కరోనా వ్యాప్తి ఎక్కువ గా జరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యం లో.. ఈ మహమ్మారి నుంచి కస్టమర్ లను రక్షించుకోవడానికి బ్యాంకులు కూడా సిద్ధం అవుతున్నాయి. త్వరలో, దేశంలోని బ్యాంకులు ఇప్పుడు కాంటాక్ట్‌లెస్ ఎటిఎం మెషిన్ లను అమర్చడానికి  సిద్ధం అవుతున్నాయి.  ఎటిఎం టెక్నాలజీపై పనిచేసే ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ యంత్రాన్ని రూపొందించింది. దీనిలో... ఉండే క్యుఆర్ కోడ్ ను మొబైల్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా కాష్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. 
        ప్రస్తుతం వాడుతున్న ఎటిఎం కార్డ్స్ లలో మాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది. దీనిలోనే.. కస్టమర్ డేటా ఉంటుంది. ఈ ఎటిఎం యంత్రం పిన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత డేటాను తనిఖీ చేస్తుంది. దీని తరువాత, కస్టమర్ డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇస్తుంది.అయితే.. ఇపుడు కొత్తగా రాబోతున్న కాంటాక్ట్ లెస్ ఎటిఎం లలో యంత్రాలలో, కస్టమర్ ఎటిఎం యంత్రాన్ని తాకాల్సిన పనిలేదు. కస్టమర్లు దేనిని తాకకుండా తమ మొబైల్ ఫోన్ ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ఏటీఎం మెషీన్‌లో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన మొత్తాన్ని మొబైల్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఏటీఎం నుంచి నగదు విడుదల అవుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా నగదు తీసుకోవడం సులభతరమైనదే కాదు.. సురక్షితం కూడా. కేవలం 25 సెకండ్లల్లో డబ్బు ను విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox