Breaking News

చైనా దిగొచ్చిందా..? సరిహద్దు వద్ద వెనక్కి తగ్గినా చైనా బలగాలు...!

06 th Jul 2020, UTC

           గాల్వాన్ లోయ వద్ద చైనా వెలగబెట్టిన దాష్టీకం భారత్ లో ఆగ్రహ జ్వాలలకు కారణమైన సంగతి తెలిసిందే.. భారత్ లో ఇప్పటికీ నిరసన కొనసాగుతోంది.. పలువురు చైనా తో ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను ఒప్పందాలను రద్దు చేస్తున్నారు. మరో వైపు.. భారత్ కేంద్ర ప్రభుత్వం.. కూడా చైనా కు చెందిన 50 ఆప్ లను రద్దు చేయడం తో చైనా కు తెలిసొచ్చింది..  చైనా భారత్ తో గిల్లి కజ్జాలు మొదలు పెట్టిన అప్పటి నుంచి భారత్ లో చైనా పట్ల నిరసనలు ఎక్కువైనా సంగతి తెలిసిందే. 
 
            సరిహద్దు లో కవ్వింపు చర్యలకు  పాల్పడుతూ.. యుద్దానికి ఉసిగొల్పిన సంగతి తెలిసిందే.. జూన్ 15 న జరిగిన పోరాటం లో.. భారత వీరుల ధైర్య సాహసాలను చూసి చైనా తోక ముడిచింది.. చైనాకు చెందిన 59 యాప్స్‌ని నిషేధించడం, చైనా కంపెనీలకు ప్రాజెక్టులను రాష్ట్రాలు రద్దు చేసుకోవడం, అమెరికా, రష్యా, ఫ్రాన్స్... భారత్‌కి అండగా నిలవడం... ఇవన్నీ చూసి... చైనా ఇక తన ఆటలు సాగవని భావిస్తోంది.. భారత్ తో పెట్టుకుంటే.. తానూ ఆర్ధికం గా కూడా నష్టపోవాల్సి ఉంటుంది అని చైనా కు ఇప్పటికే అర్ధం అయింది. 
 
              తాజాగా.. ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయి లో కూడా చర్చలు జరిగాయి.. ఈ చర్చల్లో ఇరు దేశాల సైన్యాలు వెనక్కి వెళ్లాలని చర్చల్లో చెప్పుకున్నారు. కానీ.. చైనా సైన్యం సరిహద్దుల్లోని తిష్ట వేసుకుని ఉంది. చైనా సైన్యాన్ని వెనక్కి తీసుకోకుండా నాలుగు రోజుల పాటు కాలక్షేపం చేసింది. అయితే.. ఎన్నాళ్లయినా పరిస్థితి సద్దుమణగక పోవడం తో.. భారత్ సైన్యం దెబ్బ రుచి చుసిన చైనా సైన్యం వెనక్కి తగ్గడం ప్రారంభించింది. అయితే.. చైనా కు చెందిన ఆయుధ సామగ్రి మాత్రం అక్కడ నుంచి తొలగించలేదు.. ఆ ఆయుధ సామగ్రిపై భారత సైన్యం ఓ కన్నేసి ఉంచుతోంది. ఇప్పటికే భారత చర్యల పట్ల చైనా షాక్ లో ఉంది.. అంతే కాకుండా.. మొన్న శుక్రవారం ప్రధాని మోదీ  లడఖ్ వెళ్లి సైన్యాన్ని పరామర్శించడం తో.. చైనా బెదిరిపోయింది. దీనితో.. దెబ్బ తిన్న చైనా అధికారులు 48 గంటల్లో... రకరకాలుగా భారత్‌తో సంప్రదింపులు, చర్చలు, మాటలు సాగించారు. చివరకు... తోక ముడిచారు. మరో వైపు.. అంతర్జాతీయం గా జరుగుతున్నా పరిణామాలు కూడా చైనా వెనక్కి తగ్గడానికి కారణం అవుతున్నాయి.. చైనా కు మద్దతిచ్చే దేశాలు లేకపోవడం.. పాకిస్థాన్.. ఉత్తరకొరియా లాంటి దేశాలు మద్దతిచ్చినా. ఆ దేశాల పరిస్థితే అంతంత మాత్రం.. అవి చేసే సాయం తో చేసేదేమి లేక.. చైనా పాలకులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox