Breaking News

ఢిల్లీ వాసులంటే నిర్వచనం చెప్పాలి:మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం

09 th Jun 2020, UTC

బయటవారికి ఢిల్లీలో కరోనా చికిత్స అందించబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఢిల్లీ వాసులకే కరోనా చికిత్స చేస్తామని కేజ్రీవాల్‌ అంటున్నారు.. కానీ ఢిల్లీ వాసులంటే నిర్వచనం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. రాష్ట్రేతరులకు అనుమతి లేదన్న  ప్రకటనపై ‌ న్యాయ నిపుణులను సంప్రదించారా అని ప్రశ్నించారు

దేశంలోని ప్రజలు జనవరి నెలలో కేంద్ర పథకం ఆయుష్మాన్‌ భారత్‌లో తమ పేరును నమోదు చేసుకుంటే.. దేశంలో ఎక్కడైన చికిత్స చేసుకునే వెసులుబాటు ఉంటుందని చిదంబరం గుర్తు చేశారు.    దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలకు హక్కులుంటాయని   కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ  అన్నారు. కరోనా చికిత్సకు రాష్ట్రేతరులు అనుమతి లేదన్న ప్రకటనపై  ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.

 ఢిల్లీలో ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా చికిత్స అందచేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్ధానికేతరుడు పేరుతో ఏ ఒక్క రోగికీ ట్రీట్‌మెంట్‌ను నిరాకరించరాదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కులో ఆరోగ్యంగా జీవించే హక్కు అంతర్భాగమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox