Breaking News

అవి భారత్ ఉత్పత్తులే.. కేంద్ర హోం శాఖ..!

02 nd Jun 2020, UTC
అవి భారత్ ఉత్పత్తులే..  కేంద్ర హోం శాఖ..!
 
‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా పారామిలిటరీ క్యాంటీన్లలో 1,000కు పైగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను నిషేధించాలన్న కేంద్ర ఉత్తర్వులను హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం తెలిపారు. పారామిలిటరీ క్యాంటీన్‌లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.
 
దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను పరిశీలించగా ఆ క్యాంటీన్లలో నిషేధించబడిన ‘నుటెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్ ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్‌ఫిగర్ షర్ట్స్‌, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్‌లు ఉన్నట్లు గమనించారు. అంతేగాక మైక్రోవేవ్ ఓవెన్లు, అనేక ఇతర గృహోపకరణాలు వస్తువులు కూడా తీసివేశారు. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ఏడు సంస్థలను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించారు. వీటితో పాటు డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను నిషేధ బ్రాండ్ల జాబితా నుంచి తొలగించామని అధికారులు పెర్కొన్నారు.
 
దీనిపై హోంమంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. అంతేగాక భారతలో ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్‌లలో చెర్చిన సదరు సీనియర్‌ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు.  ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox