Breaking News

యూపీలో భారీగా పేలుడు పదార్దాల స్వాధీనం

23 rd Aug 2020, UTC
యూపీలో భారీగా పేలుడు పదార్దాల స్వాధీనం

ఢిల్లీ:  దేశ రాజధాని డిల్లీలో రెండు రోజుల అరెస్ట్ చేసిన  ఐసీస్‌ ముఠా నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. ఐఎస్‌ఐఎస్‌ సంస్థతో సంబంధాలున్న మహ్మద్‌ ముస్తాకీమ్‌ అలీయాస్‌ అబూ యూసఫ్‌ను శుక్రవారం రాత్రి ఢిల్లీ నడి వీధుల్లో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో యూసఫ్‌ ఇంట్లో  పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, అత్మాహుతికి పాల్పడే బాడీ జాకెట్లను పోలీసులు గుర్తించారు.  ఉత్తర ప్రదేశ్‌లోని బలంపూర్‌ సమీపంలోని ఓ నివాసంలో గుర్తించిన పోలీసులు వాటినిచూసి అప్రమత్తమయ్యారు.

దీనితో వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృంధం మరికొన్ని ఆధారాలను సేకరిస్తోంది. యూసఫ్‌తో పాటు ఇంకా ఎవరైనా పేలుళ్లకు ప్రయత్నిస్తున్నారా..? ఏయే ప్రాంతాలు వారి టార్గెట్‌లో ఉన్నాయన్న అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు యూపీలో భారీగా పేలుడు పదర్ధాలు లభ్యం కావడంతో  ఢిల్లీతో సహా దేశంలోని ముఖ్య పట్టణాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox