Prime9

Maharashtra: మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన..! ఆరుగురు మృతి, 20మంది గల్లంతు!

Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 20కిపైగా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు.

 

ఇంద్రాయణి బ్రిడ్జ్ కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాదం విషయం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న డివిజనల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, సీపీ, తహశీల్దార్‌ను తాను నిరంతరం సంప్రదిస్తున్నానన్నారు. గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన సెర్చ్ ఆపరేషన్ కొనసాగించానలి అధికారులకు ఆదేశాలు జరీ చేసినట్లుగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

 

 

Exit mobile version
Skip to toolbar