Breaking News

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేస్తున్న బీజేపీ: సీఎం అశోక్ గెహ్లాట్

11 th Jun 2020, UTC

రాజస్తాన్‌లో మూడు స్థానాలకు ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం మొత్తం మూడింటిలో కాంగ్రెస్ రెండు స్థానాలు‌, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అయితే సరైన సంఖ్యాబలం లేకున్నా బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారనిరాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. రాజ్యసభ ఎ‍న్నికల్లో ప్రత్యర్థికి ఓటు వేసే విధంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆశచూపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది. ఎన్నికల వేళ బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇ‍ప్పటికే గుజరాత్‌‌లో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. వారంతా బీజేపీ ఒత్తిడి మేరకు రాజీనామాలు చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

. రాజస్థాన్‌లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా.. ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం రెండు కాంగ్రెస్‌, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. కానీ, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox