Breaking News

హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బిపిన్ రావత్ దంపతులు

08 th Dec 2021, UTC

తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఘటనలో రావత్‌తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. 

హెలికాఫ్టర్ ప్రమాదం విషయం తెలియగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లారు. సైనిక ఉన్నతాధికారులు కూడా రావత్ నివాసానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆర్మీ చీఫ్ నరవణే ఇప్పటికే రాజ్‌నాథ్‌కు వివరించారు.  దీనిపై రాజ్ నాధ్ సింగ్ రేపు పార్లమెంట్ లో ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావశమవుతోంది.

సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ఈ హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox