Breaking News

Babul Supriyo: పాలిటిక్స్ కు గుడ్ బై అన్న బాబుల్ సుప్రియో

01 st Aug 2021, UTC

మాజీ కేంద్రమంత్రి ఎంపీ బాబుల్ సుప్రియో శనివారం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే, తాను ఏ ఇతర పార్టీకి వెళ్లడం లేదని స్పష్టం చేసారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో "నేను వెళ్తున్నాను. అల్విద (వీడ్కోలు) అంటూ తెలిపారు.

నేను ఏ ఇతర పార్టీకి వెళ్లడం లేదు #టీఎంసి, # కాంగ్రెస్, # సీపీఐ ఎక్కడా లేదు. నేను ఒక టీమ్ ప్లేయర్. ఎప్పుడూ ఒక టీమ్‌కి #మోహన్‌బగన్‌కు మద్దతు ఇచ్చాను. పశ్చిమబెంగాల్ లో బీజేపీకి మాత్రమే మద్దతు ఇచ్చాను. అంతే, నేను వెళ్తున్నాను. "అని రాసారు. తాను ఎంపీ పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్లు సుప్రియో చెప్పారు

అయితే అతని రాజీనామా కేవలం డ్రామా అని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఇది షోలే సినిమా లాగా డ్రామాఅని అన్నారు. తృణమూల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ పార్టీలో మరియు ప్రభుత్వంలో తనను పక్కనపెట్టిన తర్వాత పార్టీలో మెరుగైన ఒప్పందం కోసం బాబుల్ సుప్రియో బేరమాడాలని భావించాడని అన్నారు. బెంగాల్  బీజేపీ  చీఫ్ మరియు ఎంపి దిలీప్ ఘోష్ మాట్లాడుతూ బాబుల్ రాజీనామా విషయం తనకు తెలియదన్నారు.

2014, 2019 లోక్ సభఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో మోదీ క్యాబినెట్లో మంత్రిగా వున్నారు. అయితే ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణ సందర్బంగా ఆయనను తొలగించారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox