Breaking News

ఆటోవాలా ఇంట్లో అమిత్ షా భోజనం

07 th Apr 2021, UTC
ఆటోవాలా ఇంట్లో అమిత్ షా భోజనం

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో నాలుగో దశ ఎన్నికల కోసం బీజేపీ తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా డొమ్‌జూర్, సింగూరులలో బుధవారం రోడ్‌ షోలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మధ్యాహ్నం డొమ్‌జూర్‌లోని ఓ ఆటోవాలా ఇంట్లో భోజనం చేశారు

భోజనం చేసిన తర్వాత అమిత్ షా మాట్లాడుతూ, తాను కేవలం ఒక గ్రామ పంచాయతీని మాత్రమే సందర్శించానని, అయితే ఇక్కడ కనిపించిన ఉత్సాహాన్ని చూస్తే తమ అభ్యర్ది రాజీబ్ బెనర్జీ ఆధిక్యంతో గెలుస్తారని నమ్మకం కలిగిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలను గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ప్రసంగాలను పరిశీలించినపుడు, ఆమె ఎంత నైరాశ్యంలో ఉన్నారో అర్థమవుతుందని చెప్పారు. 

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ ఏప్రిల్ 10న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox