Breaking News

పంజాబ్ మంత్రులకు శాఖలు కేటాయింపు 14 శాఖలు సీఎం వద్దే..

28 th Sep 2021, UTC

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చాన్నీ మంగళవారం  మంత్రులకు శాఖలను  కేటాయించారు.విజిలెన్స్, జస్టిస్, పవర్, ఎక్సైజ్, సివిల్ ఏవియేషన్ వంటి 14  శాఖలను చన్నీ తన వద్దే వుంచుకున్నారు. డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ రాంధవాకు హోం వ్యవహారాలు, డిప్యూటీ  సీఎం ఓం ప్రకాష్ సోనికి  ఆరోగ్య శాఖ కేటాయించారు. మన్‌ప్రీత్ సింగ్ బాదల్  ఆర్థిక, పన్నులు మరియు ప్రణాళిక మంత్రిత్వ శాఖ,రాణా గుర్జీత్ సింగ్ సాంకేతిక విద్య, ఉద్యాన శాఖలు దక్కాయి.

ఆదివారం 15 మంది ఎమ్మెల్యేలు చన్నీక్యాబినెట్  లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 8 మంది అమరీందర్ సింగ్ ప్రభుత్వంలోనివారు కాగా  మిగిలిన ఏడుగురుకొత్తవారు. గత వారం, చండీగఢ్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ సమక్షంలో, పంజాబ్ 16 వ ముఖ్యమంత్రిగా 58 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం చేసారు. చన్నీతో పాటు, ఇద్దరు డిప్యూటీ సిఎంలు - సుఖ్జీందర్ సింగ్ రాంధవా (ఎ జాట్ సిక్కు) మరియు ఓపి సోని (హిందువు) కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ మంత్రిగా ఉన్న చన్నీ, చమ్‌కౌర్ సాహిబ్ నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను  నవజ్యోత్ సిద్ధు కు  సన్నిహితుడు.

తనకు తెలియకుండా సీఎల్పీ సమావేశం నిర్వహించడంపై కలత చెందిన సీఎం అమరీందర్ సింగ్  తన పదవికి రాజీనామా చేసారు. ఇది తనను అవమానించడమేనని ఆయనఅన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox