Breaking News

శానిటైజర్లపై 18 శాతం జీఎస్ టీ అందుకే:కేంద్ర ఆర్దిక శాఖ

16 th Jul 2020, UTC

కరోనా మహమ్మారి నేపధ్యంలో పరిశుభ్రత కీలకంగా మారింది. బయటకు వెళ్లినపుడు మాస్క్ తప్పనిసరికాగా చేతులను పరిశుభ్రంగా వుంచుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్చందసంస్దల గట్టిగా ప్రచారం చేసాయి. దీనితో గతంలో  ఎన్నడూ లేని విధంగా దేశంలో శానిటైజర్ల వాడకం ఒక్కసారిగా పెరిగింది. దీనితో డిమాండ్ కు తగ్గ రీతిలో కంపెనీలు కూడ  ఉత్పత్తిని పెంచాయి.

 అయితే శానిటైజర్ల పై 18 శాతం జీఎస్ టీ ని తగ్గిస్తే ఇది ఇంకా చవకగా దొరుకుతుందని దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని పలువురు కోరారు. అయితే దీనిపై తాజాగా కేంద్ర ఆర్దిక శాఖ క్లారిటీ ఇచ్చింది.
శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్‌ ద్రావకాలు, డెట్టాల్‌ మాదిరే ఇన్ఫెక్షన్‌ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

శానిటైజర్లలో వినియోగించే పలు రకాల రసాయనాలు, ప్యాకింగ్‌ సామగ్రిపైనా జీఎస్‌టీ 18 శాతం అమల్లో ఉందంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శానిటైజర్లపై జీఎస్‌టీని తగ్గించినట్టయితే అది విలోమ సుంకాల విధానానికి (తుది ఉత్పత్తిపై జీఎస్‌టీ కంటే దాని తయారిలో వినియోగించే సరుకులపై అధిక జీఎస్‌టీ ఉండడం) దారితీస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకునే హ్యాండ్‌ శానిటైజర్లు చౌకగా మారతాయి. దీంతో దేశీయ తయారీ దారులకు ప్రతికూలంగా మారుతుంది అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది.

 అంటే దేశీయంగా శానిటైజర్లు తయారీ చేసే ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వుండటానికే వీటిపై  18 శాతం జీఎస్ టీ ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం స్ఫష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox