లాంటి నిబంధనలు లేకుండా లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేతఅసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
చేశారు. ప్రస్తుతం విధించిన రెండు నెలలకు పైగా లాక్ డౌన్ వల్ల సాధించింది ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. లాక్డౌన్ అమలు చేస్తూ ఒకసారి చప్పట్లు కొట్టాలని, మరోమారు దీపాలు వెలిగించాలని మోదీ పిలుపు ఇచ్చి కరోనాను అరికట్టగలిగారా? అని ప్రశ్నించారు. పేదలను నిర్బంధించి ఉపాధి లేకుండా చేసి ఆకలి చావులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జైపూర్-బిహార్ రహదారిపై ఆకలికి తాళ లేక వలస కార్మికుడు శునకం కళేబరాన్ని తింటున్న దృశ్యాలు తనను కదిలించివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఒవైసీ ఓ జాతీయ వార్తా ఛానెల్ ముఖాముఖిలోనూ శనివారం మాట్లాడిన సందర్బంగా చైనాతో సరిహద్దు వివాదంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. లద్దాఖ్‌లో చైనా బలగాలు భారత సరిహద్దుల వద్ద మోహరించడం కేంద్రం వైఖరి నిదానంగా ఉందని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని డీల్ చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఆర్టికల్ 370 ఎత్తివేసి లద్దాఖ్, జమ్ము కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాక, చైనా తమ బలగాలను లద్దాఖ్ సరిహద్దుల వద్ద మోహరించింది. అంతేకాక, భారత్‌వైపు కొన్ని కిలోమీటర్ల మేరక ఆక్రమించుకుంది. ఒకవేళ చైనాతో మోదీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంటే వేటి గురించి మాట్లాడుతున్నారు? డోక్లాం వివాదంలోనూ కేంద్రంనిదానంగా ఉండిపోయింది. ఇప్పుడు డోక్లాంలో చైనాకు చెందిన బంకర్లు గతంలో కంటే మరిన్ని వెలిశాయి. ఉపగ్రహ చిత్రాలు అబద్ధం చెప్పవు. అని ఒవైసీ అన్నారు.
మరోవైపు, ఈ విషయాలపై తన అభిప్రాయాన్ని ప్రధాని మోదీ ఎక్కడా వ్యక్తపర్చరని అన్నారు. కనీసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడే సందర్భంలో కూడా చైనా గురించి మాట్లాడబోరని విమర్శించారు. చైనా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదో దేశం మొత్తానికి తెలుసని ఒవైసీ అన్నారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
16 Jan 2021
16 Jan 2021