Breaking News

లాక్‌డౌన్ మాత్రమే ముగిసింది.. వైరస్ ప్రస్థానం కాదు :వెంకటేష్

02 nd Jun 2020, UTC
లాక్‌డౌన్ మాత్రమే ముగిసింది.. వైరస్ ప్రస్థానం కాదు :వెంకటేష్

లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని  హీరో విక్టరీ వెంకటేష్ హెచ్చరించారు. ఇప్పుడే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వెంకీ తన ట్విటర్ ఖాతాలో ఓ లేఖను పోస్ట్ చేశారు.



`కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి గత 70 రోజులుగా నిర్విరామంగా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. ప్రజలందరి రక్షణ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేసిన సిబ్బందికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. ఇప్పుడిప్పుడే ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిక మనదే బాధ్యత.

 ప్రస్తుతం లాక్‌డౌన్ మాత్రమే ముగిసింది.. వైరస్ ప్రస్థానం కాదు. కాబట్టి లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో.. వాటిని ఇకపై కూడా పాటించాలి. సురక్షితంగా ఉండండి.. భౌతిక దూరం పాటించండి` అని వెంకీ పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox