Breaking News

కేరళలో ఒకే రోజు రెండు ప్రమాదాలు..

08 th Aug 2020, UTC
కేరళలో ఒకే రోజు రెండు ప్రమాదాలు..
 
కేరళ :శుక్రవారం ఒకే రోజు జరిగిన రెండు దుర్ఘటనలు కేరళలో తీవ్ర విషాదం నింపాయి.కేరళలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌కు సమీపంలో రాజమలై ప్రాంతంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. ఇప్పటికి 15 మంది మృతదేహాలు వెలికితీయగా, మరో 50 మంది  శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో నిరంతరాయంగా సహాయక చర్యలు కొసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
 
వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్‌కు చేరిన విమానం. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కిందికి దిగుతూనే రన్‌వే పై నుంచి కిందికి జారి రెండు ముక్కలయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోగా, వీరిలో పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే, కో పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. క్షతగాత్రుల్ని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే రోజు కేరళలో రెండు దుర్ఘటనల్లో దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox