Breaking News

జియో తో టిక్ టాక్ చర్చలు..??

13 th Aug 2020, UTC
జియో తో టిక్ టాక్ చర్చలు..??

ముంబై :చైనాతో భారత్ లో ఘర్షణలు నెలకొన్న నేపధ్యంలో పలు చైనా ఆప్ లను భారత ప్రభుత్వం బాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆప్ లలో టిక్ టాక్ ఆప్ కూడా ఉంది. భారత్ లో బాన్ చేయడానికి ముందే టిక్ టాక్ ఆప్ మీద పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. టిక్ టాక్ ఆప్ భద్రతా ప్రమాణాల పైనా, పని చేసే విధానంపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఈ ఆప్ వినియోగంపై అగ్ర రాజ్యం అమెరికా కూడా పలు ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఆప్ వినియోగం పై షరతు విధించారు. సెప్టెంబర్ లోపు ఈ అప్లికేషన్ అమెరికా కు చెందిన ఎదో ఒక కంపెనీ చేతుల్లోకి రావాలని, లేదంటే టిక్ టాక్ ఆప్ పై కూడా బాన్ విధిస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో మైక్రో సాఫ్ట్ తో సహా పలు అమెరికన్ సంస్థలు టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ తో చర్చలు మొదలుపెట్టాయి. మరో వైపు, బైట్‌డ్యాన్స్ సంస్థ భారత్ లో కూడా తన ప్రయత్నాలను మొదలు పెట్టింది.

భారత్ కు చెందిన రిలయన్స్ జియో కంపెనీతో బైట్‌డ్యాన్స్ చర్చలు జరుపుతోందని సమాచారం. అయితే, ఈ విషయమై అటు బైట్‌డ్యాన్స్ సంస్థ కానీ, ఇటు రిలయన్స్ జియో కానీ అధికారిక ప్రకటనలు చేయలేదు. గత నెల చివర్లో ఈ రెండు కంపెనీలు తమ చర్చలను ప్రారంభించాయి. కానీ ఈ విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భారత్ లో టిక్ టాక్ కు సంబంధించి దాదాపు మూడు బిలియన్ల వ్యాపారం జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు రెండు వేలకు మంది పైగా భారతీయులు టిక్ టాక్ లో పని చేస్తున్నారు. అయితే, వీరంతా కొత్త ఉద్యోగాలు వెతుక్కునే పనిలో పడ్డారు.

ఒకవేళ రిలయన్స్ జియోతో బైట్‌డ్యాన్స్ చర్చలు ఫలవంతమైతే, భారత్ లో తిరిగి టిక్ టాక్ వచ్చే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. దీనితో, కొంతమంది ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే పనిలో పడ్డారు. టిక్ టాక్ ఆప్ ను బాన్ చేసింది చైనా పై కోపంతో కాదా?మీ మిత్రుడు అంబానీ కోసమా అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox