Breaking News

పుంజుకుంటున్న ఆటోరంగం కార్ల కొనుగోలుకు ముందుకు వస్తున్న మధ్యతరగతి

11 th Aug 2020, UTC

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రభావం దేశీయ ఆర్దికవ్యవస్దపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. దేశంలోని అన్నిరంగాలు కరోనా దెబ్బకు ఉత్పత్తిని తగ్గించుకునే పరిస్దితి వచ్చింది. అమ్మకాలు లేకపోవడం, వలస కార్మికుల స్వస్దలాలకు వెళ్లడం , లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం ఇవన్నీ ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఇదే రీతిలో  అమ్మకాలు లేక డీలా పడిన భారత ఆటో పరిశ్రమ తిరిగి గాడినపడుతోంది. గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు పడిపోతుండగా  జులైలో  కొద్దిగా పుంజుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో వాహన విక్రయాలు 30 శాతం అధికమని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం) గణాంకాలు వెల్లడించింది.
 
 జులైలో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్రవాహన విక్రయాలు పుంజుకోవడం పరిశ్రమ రికవరీకి సంకేతమని ఎస్‌ఐఏఎం అధ్యక్షుడు రాజన్‌ వధేరా పేర్కొన్నారు. . ఇక ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జులైలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 26 శాతం పెరగడం ప్రోత్సాహకరమని ఎస్‌ఐఏఎం పేర్కొంది. ఇక కార్ల విక్రయాలు అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో 73 శాతం ఎగబాకాయని వెల్లడించింది.
 
కరోనా కారణంగా  విలాస వస్తువుల జాబితాలో ఉన్న కారు ఇప్పుడు ‘అవసరం’గా మారే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్నత, ఎగువ మధ్య తరగతి  వారికే పరిమితమయిన  కార్లు ఇప్పుడు సగటు మ ధ్య తరగతి ఇళ్ల ముందూ కనిపించబోతున్నాయి.  నెలల తరబడి ప్రజా రవాణా, స్తంభించడం ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం భద్రం కాదని భావిస్తున్న జనం. కార్ల కొనుగోలుపై మోజు చూపుతున్నారు. తమ ప్రయాణ అవసరాలతో పాటు పిల్లలను ఆటోలు, బస్సుల్లో బడికి పంపడం సురక్షితం కాదని యోచిస్తున్న పలువు రు కారు కొనాలని  భావిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox