Breaking News

కరోనా సమయంలో పేర్లమార్పా?పళని సర్కార్ ను తప్పు పడుతున్న నెటిజన్లు..!

12 th Jun 2020, UTC

తమిళులకు తమ భాషను, సంస్కృతని అమితంగా ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, కాపాడుకుంటారు. అయితే కొన్ని ప్రదేశాల పేర్లలో చిన్న చిన్న మార్పులు చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. నేమ్‌ఛేంజ్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్ వేదికగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు ప్రభుత్వం 1,018 ప్రదేశాల పేర్ల ఇంగ్లిష్ స్పెల్లింగ్స్‌లో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమిళ ఉచ్చారణకు అనుగుణంగా వీటిని మార్చాలని నిర్ణయించింది. జిల్లాల అధికారులతో సంప్రదించి, వారి సిఫారసులను పరిగణనలోకి తీసుకుని, ఓ కమిటీ ఈ నిర్ణయానికి తుది రూపం ఇచ్చింది. పేర్ల మార్పుకు జిల్లాల కలెక్టర్లు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారు.

ఈ సందర్బంగా  నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తమిళనాడు పేరును కూడా మార్చాలని, ఇంగ్లిష్‌లో ‘టీఏఎంఐఎల్ ఎన్ఏడీయూ’ అని రాయడానికి బదులుగా ‘టీహెచ్ఏఎంఐజెడ్‌హెచ్ ఎన్ఏఏడీయూ’ గా మార్చాలని సలహా ఇస్తున్నారు.

తమిళ ఉచ్చారణకు అనుగుణంగా పేర్లు మార్చడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. మరికొందరు మాత్రం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయపడటంపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేర్ల మార్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. పేర్లు మార్చడం కోసం సమయం, వనరులు వృథా అవుతున్నాయంటున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox