Breaking News

దేశ రక్షణ హైదరాబాద్ నుంచే

12 th Aug 2020, UTC
దేశ రక్షణ హైదరాబాద్ నుంచే

తెలంగాణ:   రక్షణ రంగానికి చెందిన 101 వస్తువుల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే . కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరేడు సంవత్సరాల్లో దేశీయ ఇండస్ట్రీస్‌కు  4 లక్షల కోట్ల కాంట్రాక్టులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి హైదరాబాద్ కేరాఫ్ గా మారనుందా?

ఎన్నో ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దేశ రక్షణ రంగానికి కీలకమైన ఆయుధ సామగ్రి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇవి అందిస్తున్నాయి. మనదేశ రక్షణ ఉత్పత్తుల చిత్రపటంలో  హైదరాబాద్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల సారథ్యంలో...  ప్రైవేటు రంగంలో ఎన్నో చిన్న, మధ్యతరహా యూనిట్లు ఏర్పాటయ్యాయి.  అవాంటెల్‌, జెన్‌ టెక్నాలజీస్‌, ఎంటార్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ కోవలోకి వచ్చే కంపెనీలే. ఇవి కాకుండా దేశీయంగా అగ్రగామి కార్పోరేట్‌ సంస్థలకు చెందిన రక్షణ ఉత్పత్తుల యూనిట్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందులో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌,  నేషనల్‌ బెలూన్‌ ఫెసిటిలీ  , కళ్యాణి ఫోర్ట్‌... వంటివి ముఖ్యమైనవి. సమీప భవిష్యత్తులో ఈ సంస్థలు మనదేశ భద్రతకు ఆయువు పట్టు కాబోతున్నాయి. రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణకు శ్రీకారం చుట్టటమే దీనికి కారణం. ఇందువల్ల రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ హైదరాబాద్‌లో బహుముఖంగా విస్తరించనుంది.

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా.. 101 రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నెల 7న ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి రెండేళ్ల కాలంలో ఈ వస్తువుల దిగుమతులను క్రమంగా నిలుపుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
 
ఇందులో మర ఫిరంగుల నుంచి అసాల్ట్‌ రైఫిల్స్‌, సిమ్యులేటర్లు, లైట్‌ కంబాట్‌ హెలీకాఫ్టర్లు, రాడార్లు... ఇలా పలు రకాల ఉత్పత్తులున్నాయి. ఈ ఉపకరణాలు తయారు చేసే పలుసంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ సంస్థలకు ఇక ఆకాశమే హద్దుగా అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
 
ఆకాష్‌, నాగ్‌ వంటి క్షిపణిలను, వరుణాస్త్ర  ,  మీడియమ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్ వంటి పలు రకాల ఆయుధాలను భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తోంది. రాడార్లు, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను తయారు చేసే సంస్థ ఈసీఐఎల్‌, అణు ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థగా  న్యూక్లియర్‌ ఫ్లూయల్‌ కాంప్లెక్స్‌ హైదరాబాద్  కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
 
ఇక ,  ప్రైవేటు రంగంలోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సిరోస్కి - హెలీకాఫ్టర్లకు కేబిన్లు తయారు చేస్తోంది. దేశంలోనే అతిపెద్దదైన అదాని ఏరోస్పేస్‌ పార్క్‌ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఏర్పాటైంది.
యూఏవీ లను స్థానిక కంపెనీలైన సైయెంట్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తయారు చేసి రక్షణ రంగానికి సరఫరా చేస్తున్నాయి.  సిమ్యులేటర్ల తయారీలో స్థానిక కంపెనీ అయిన జెన్‌ టెక్నాలజీస్‌ పాతికేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మారిన కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశీయ ఆయుధ రంగంలో ఈ సంస్థలన్నీ ఇకపై మరింత కీలక పాత్ర పోషించవచ్చు . దీంతో , రక్షణ రంగానికి హైదరాబాద్ మరింత కీలకం కానుందన్న అబిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి .
 
అత్యధికంగా ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో - మనదేశం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు నడుం కట్టింది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, కట్టుదిట్టంగా ఈ మార్గంలో ముందుకు సాగితే - వచ్చే దశాబ్దకాలంలో మనదేశం రక్షణ ఉత్పత్తులను పెద్దఎత్తున ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని రక్షణ ఉత్పత్తుల నిపుణులు పేర్కొంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox