Breaking News

ఢిల్లీ అల్లర్ల చార్జిషీటులో సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరు

24 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటికే చార్జిషీట్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అల్లర్లకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఇప్పటికే పలువురి పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం నాయకురాలు బృందా కారత్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సమా ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరును చార్జిషీట్‌లో చేర్చిన విషయం బయటకు వచ్చింది.

ఇందులో భాగంగా, సుమారు 17 వేల పేజీలతో సెప్టెంబరు 13న నమోదు చేసిన చార్జిషీట్‌లో ఉమర్‌ ఖలీద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, నదీం ఖాన్‌, వంటి నాయకులు యాంటీ సీఏఏ- ఎన్సార్సీ ఉద్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలను ప్రేరేపించారుఅని ఒక సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీనిపై సల్మాన్ ఖుర్షీద్ ఆగ్రహం వ్యక్తం చేసారు.మీరు చెత్తను సేకరిస్తే చాలా మలినాలే వస్తాయి. ఆ చెత్తను ఎవరికైనా ఆపాదించవచ్చు. రెచ్చగొట్టే ప్రసంగాలంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నా. నేనేమైనా జోలపాట పాడేందుకు ఆ సమావేశానికి హాజరయ్యానా?  రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన కారణానికి హాజరయ్యానా? ఆలోచించండి. ఓ చెత్తను సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చెత్తను సేకరించే వారు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదు. చెత్తను సేకరించకండి. చెత్త నాణ్యతపై ప్రశ్నలు వేయకండి అంటూ ఖుర్షీద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox