Breaking News

రాహుల్ గాంధీ ని కలిసిన సచిన్ పైలట్ రాజస్తాన్ కధ క్లైమాక్స్ కు చేరినట్లేనా?

10 th Aug 2020, UTC

రాజస్తాన్  :రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు పుల్ స్టాప్ పడి కధ క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది.  సోమవారం సచిన్ పైలట్ రాజీవ్ గాంధీని కలిసి చర్చలు జరపడం తో ఈ యువనాయకుడి ఘర్ వాస్సీ  ఖాయమని తెలుస్తోంది. మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సచిన్ పైలట్ తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి గత 20 రోజులుగా  హరియాణాలోని స్టార్ హోటల్లో మకాం వేసిన సంగతి తెలిసిందే. సీఎం అశోక్ గహ్లాట్ పై తీవ్ర అసంతృప్తితో వున్న పైలట్ తో మాట్లాడాలని అప్పట్లో రాహుల్ గాంధీ ప్రయత్నించినా పైలట్ అందుకు ముందుకు రాలేదు. అయితే రాహుల్ సోదరి ప్రియాంక మాత్రం చొరవ తీసుకని సచిన్ పైలట్ తో చర్చలు జరిపినా అవి ఫలించలేదు.దీనితో తనకు సీఎం పదవి ఖచ్చితంగా ఇవ్వాలంటూ సచిన్ పైలట్ గట్టిగా పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ ల మధ్య జరిగిన చర్చలు తమకు అనుకూలంగా వున్నాయని సచిన్ పైలట్ వర్గం భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పైలట్ రాహుల్ గాంధీకి కొన్ని విధించినట్లు తెలుస్తోంది. 
 
సచిన్ పైలట్ ను కాబోయే సీఎంగా బహిరంగంగా పార్టీ ప్రకటించాలి. అది సాధ్యం కాకపోతే తన వర్గానికి చెందిన ఇద్దరిని డిప్యూటీ సీఎంలు గా చేయాలి. పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో  చోటు కల్పించాలి. వారికి కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలి. పైలట్ డిమాండ్లకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ తన డిప్యూటీ సీఎం , పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టాలని రాహుల్  భావిస్తున్నట్లు భోగట్టా. పైలట్ గౌరవానికి భంగం కలగకుండా తన వర్గం అన్యాయానికి గురవకుండా చూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని బలం నిరూపించుకోవాలని డిమాండ్లు రేగడం దానికి సీఎం సరే ననడం తెలిసిందే. దీనితో సీఎం గెహ్లాట్ కూడ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని జైపూర్ నుంచి జోధ్ పూర్ కు తరలించారు. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.మరో వైపు సచిన్ పైలట్ తాను బీజేపీ లో చేరేది లేదని చెబుతూనే వున్నారు.మొత్తంమీద రాజస్తాన్ కాంగ్రెస్ కధ సుఖాంతమయినట్లే కనిపిస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox