Breaking News

వచ్చే ఐదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు

01 st Aug 2020, UTC
వచ్చే ఐదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు

న్యూఢిల్లీ :రానున్న అయిదేళ్లలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేంద్ర  ఐటీ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ శనివారం ప్రకటించారు. వివిధ దిగ్గజ ఎలక్ట్రానిక్ తయారీదారులు వచ్చే అయిదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్‌ఫోన్లు, విడిభాగాల తయారీ  చేసేలా ప్రతిపాదించారని,  తద్వారా ప్రత్యక్షంగా,  పరోక్షంగా  12లక్షల వరకు ఉద్యోగాలు  సృష్టించనున్నారని వెల్లడించారు. 

ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11లక్షలకు కోట్ల రూపాయలకు పైగా  విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు తయారు కానున్నాయని కేంద్రం మంత్రి  వెల్లడించారు. పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ ఐదు అంతర్జాతీయ బ్రాండ్లతో సహా మొత్తం 22కంపెనీలు ఈ పథకం కింద 22కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. 

ఈ  కంపెనీల  7లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనున్న నేపథ్యంలో మూడు లక్షల ప్రత్యక్ష, తొమ్మిది లక్షల పరోక్ష ఉద్యోగాలు దేశీయంగా లభిస్తాయని పేర్కొన్నారు.  ఈ పథకం  ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్‌  లక్ష్యాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox