Breaking News

అవిశ్వాసం పెట్టిన అభ్యంతరం లేదు : యడ్యూరప్ప

26 th Sep 2020, UTC

కర్ణాటక :ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రతిపక్షం కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. యడియూరప్ప సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అవిశ్వాసం పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పీకర్ కు నోటీసులు కూడా పంపారు. కరోనా మహమ్మారి విస్తరిస్తుంటే దీన్ని అరికట్టడంలో యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన ఆరోపించారు.

మరో వైపు రాష్ట్రము ఆర్ధికంగా  కూడా రాష్ట్రం వెనుకబడిందని అన్నారు.. గత వారంలో ఓ కేంద్ర మంత్రిని, ఓ రాజ్యసభ ఎంపీని, ఓ ఎమ్మెల్యేను కోల్పోయామని అన్నారు. కరోనా గడ్డు కాలంలో రాష్ట్రం లో 2,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అవిశ్వాసం అనేది ఓ 'రాజీకయ జిమ్మిక్కని'  బీజేపీ ఆగ్రహించింది. కాంగ్రెస్ పార్టీకి సరైన సంఖ్యాబలం కూడా లేదన్నారు. అయినా సరే. కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టినప్పటికీ తనకేమి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. "నాకేమీ అభ్యంతరం లేదు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టమనండి. ప్రతి ఆర్నెళ్లకోసారి అవిశ్వాసం అంటారు. మరో ఆరు నెలల పాటు నేను సేఫ్ గా ఉంటాను" అని యడ్యూరప్ప కామెంట్ చేశారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox