Breaking News

అంఫాన్ తుఫాన్ విద్వంసం మరవకముందే.... మరో తుపాను..!

01 st Jun 2020, UTC

గత కొద్దీ రోజుల క్రితం అంఫాన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్.. ఒడిశా రాష్ట్రాల్లో భీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ తుఫాను భీబత్సం ఇక్కడితో ఆగలేదు. తాజాగా మరో తుఫాన్ దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉండవచ్చని భావిస్తున్నారు.. ఈ తుఫాన్ కు "నిసర్గ" అని నామకరణం చేసారు. ఈ 2020 సంవత్సరం లో అన్ని ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతుండడం గమనార్హం. అగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అల్పపీడనం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 370 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 690 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు ఆ శాఖ పరిశీలనలో తెలిసింది.
        అయితే.. ఈ అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండం గా మారి ఆ తరువాత పెను తుపాను గా మారుతుందని అంచనా వేస్తున్నారు. నిసర్గ అని పిలుస్తున్న ఈ తుపాను జూన్‌ 3 సాయంత్రానికి దక్షణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చని వారు తెలిపారు.ఈ తుఫాన్ ప్రభావం తో గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్రల్లో జూన్‌ 2 నాటికి 105 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. ఇక జూన్‌ 3 సాయంత్రం 5:30 గంటలకు గాలివేగం మరింత ఉధృతమై 125 కి.మీకు కూడా చేరవచ్చని అధికారులు  చెబుతున్నారు. జూన్‌ 3, 4 తేదీల్లో ఆ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అనంతరం జూన్‌ 4న తుపాను బలహీనపడవచ్చని భావిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox