Breaking News

ముంబై వూహాన్ ను దాటేసింది..!

10 th Jun 2020, UTC
ముంబై వూహాన్ ను దాటేసింది..!

ఇప్పటికే  కరోనా పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించిన మహారాష్ట్ర.. తాజాగా రికార్డును మూటకట్టుకుంది. కరోనా వైరస్‌ పుట్టిన  చైనాలోని వూహాన్‌ నగరాన్ని ముంబై మహానగరం అధిగమించింది. వూహాన్‌లో మొత్తం  50,333, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,869 మంది మృత్యువాత పడ్డారు. తాజా గణాంకాల ప్రకారం ముంబైలో 51,000 కేసులు నిర్ధారణ కాగా, 1,760 మరణించారు. దీంతో వూహాన్‌ను మించిముంబైలో కరోనా విభృంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అక్కడితో పోల్చుకుంటే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉన్నాయి.

గడిచిన 24  గంటల్లో మహారాష్ట్రలో  2,259 కేసులు నిర్ధారణ కాగా.. దేశంలో ఆ సంఖ్య 9,987గా నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉండగా.. భారత్‌లో ఆ సంఖ్య 2 లక్షల 66వేలు దాటింది. మరోవైపు దేశంలో 7466 మరణాలు సంభవించగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3,289 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

దేశంలో  మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక నాలుగో విడత లాక్‌డౌన్‌ అనంతరం ఇచ్చిన సడలింపులతో వైరస్‌ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే జూలై నాటికి దేశ రాజధాని ఢిల్లీ 5లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావచ్చన్న అధికారుల అంచనా .

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox