Breaking News

లాక్ డౌన్ 5 పై స్పందించిన మోడీ..!

02 nd Jun 2020, UTC
లాక్ డౌన్ 5 పై స్పందించిన మోడీ..!
కరోనా మహమ్మారి కారణం గా యావత్ భారత దేశం ఆర్థికం గా నష్టపోయిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఇచ్చిన తరువాత తాజాగా మోడీ ఈ విషయమై ప్రసంగించారు. సీఐఐ 125 వార్షికోత్సవ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాల దృష్టితోనే ఆత్మ నిర్భర ప్యాకేజీ రూపొందించామన్నారు. లాక్ డౌన్ అన్ లాక్ మొదటి దశ ప్రారంభమైందన్నారు మోదీ. మరో వారంలో రెండో దశ కూడా ప్రారంభమవుతుందన్నారు. కరోనా నుంచి ప్రజల్ని రక్షిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. ఈ సవాళ్లు తాత్కాలికం గానే ఉంటాయని... త్వరలోనే ఆర్థిక వ్యవస్థ గణనీయం గా పుంజుకుంటుందని... మోడీ చెప్పుకొచ్చారు. 
                 లాక్ డౌన్ కాలం లో మనం ఎలా కలిసి కట్టుగా పనిచేశామో.. మోడీ గుర్తు చేసారు. ఈ మహమ్మారి కి వ్యతిరేకంగా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు.. 8వేలమంది కోట్లకు పైగా పేదలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా  అందించామని మోడీ తెలిపారు. అనేక మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం చేసిందన్నారు. వారి ఖాతాల్లో 8వంద కోట్లు జమ చేశామని ఆయన గుర్తు చేసారు. ఇప్పటికే 53వేల కోట్లు పేదల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. ఈ ట్రేడింగ్ ద్వారా కూడా రైతులు పంటను అమ్ముకునే సదుపాయం కల్పించామని అన్నారు. కరోనా మహమ్మారి నేపధ్యం లో మేకింగ్ ఇండియా విధానానికి మోదీ పిలుపు నిచ్చారు.
            ఓ వైపు వైరస్ మహమ్మారి విస్తరిస్తుంటే.. అన్ని దేశాలు.. తమ దేశ ప్రజలను కాపాడుకునే పని లో పడితే... భారత్ మాత్రం 150 దేశాలకు పైగా సాయం అందించిందని మోడీ తెలిపారు. మెడికల్ సాయం అందించడంలో భారత్ ముందుందన్నారు మోదీ. గెట్టింగ్ గ్రోత్ బ్యాక్ కష్టమైన పని ఏమీ కాదని మోడీ ధైర్యం నూరిపోశారు. ప్రజలు ఒక అడుగు వేస్తే.. ప్రభుత్వం వారికి మద్దతుగా నాలుగు అడుగులు వేస్తుందని మోడీ భరోసా అందిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox