Breaking News

బీజేపీ కొత్త టీంకి మోడీ శుభాకాంక్షలు..!

26 th Sep 2020, UTC
బీజేపీ కొత్త టీంకి మోడీ శుభాకాంక్షలు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. జాతీయ ప్రధాన కార్యదర్శుల పదవి నుంచి రామ్ మాధవ్‌ను, మురళీధర్ రావును తప్పించారు. 70 మంది సభ్యులతో జెపి నడ్డా కొత్త టీంను ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఈ కొత్త టీంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం దక్కింది.

తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా డీకే అరుణ ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ఎన్నిక అయ్యారు. ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని ఎంచుకున్నారు. జాతీయ కార్యదర్శిగా ఏపీ నుంచి  సత్యకుమార్ ను ఎంపిక చేశారు. కొత్తగా నియమితులైన వీరందరికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. "కొత్త టీమ్‌కు శుభాకాంక్షలు. పార్టీ సంప్రదాయాన్ని మోస్తూనే దేశ ప్రజలకు నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేస్తారని ధీమాగా ప్రకటిస్తున్నా. పేదలు, అట్టడుగు వర్గాల కోసం కష్టపడి పనిచేస్తారు'' అని మోడీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా ప్రకటించారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox