Breaking News

మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.517 కోట్ల రూపాయలు ఖర్చు..

23 rd Sep 2020, UTC

న్యూఢిల్లీ :భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 నుండి ఇప్పటివరకూ మొత్తం 58 దేశాలను సందర్శించగా ఈ పర్యటనలకు అయిన ఖర్చు రూ. 517 కోట్ల రూపాయలని మంగళవారం రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం తెలిపింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు మోదీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంటు ముందుంచారు.

ప్రధాని మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు మురళీధరన్ తెలిపారు. ప్రధానమంత్రి సందర్శించిన ఇతర దేశాలలో సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శ్రీలంక ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు ఒకసారి చైనాలో పర్యటించారు. ఈ నెల ప్రారంభంలో థాయ్‌లాండ్‌ను కూడా మోదీ సందర్శించారు. అయితే కరోనా, ప్రపంచవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మోదీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని వివరించారు. చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విదేశీ పర్యటనలు సహాయపడ్డాయని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox