Breaking News

భారత్‌ను ప్రమాదంలోకి నెట్టేసిన అమిత్ షా:మమత బెనర్జీ

10 th Jun 2020, UTC
భారత్‌ను ప్రమాదంలోకి నెట్టేసిన అమిత్ షా:మమత బెనర్జీ

సంఘటిత భారత్‌ను ప్రమాదంలోకి నెట్టేసిన వ్యక్తుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒకరని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి అవినీతిని పరాకాష్టకు చేర్చారంటూ అమిత్‌షా ఆరోపణలు గుప్పించిన కొద్ది సేపటికే మమతా బెనర్జీ దీటుగా స్పందించారు.

బెంగాల్ సంస్కృతి గురించి ఓవైపు మాట్లాడుతూనే సంఘటత భారత్‌ను ప్రమాదంలోకి అమిత్‌షా నెట్టేశారు. అమిత్‌షా కళ్ల ముందే ఆయన అనుచరులు విధ్వంసం సృష్టిస్తే, ఈశ్వర చంద్ర విద్యా సాగర్ విగ్రహాన్నిమమతా బెనర్జీ తిరిగి పెట్టించిన విషయం ఆయన మరిచిపోయారా?' అని సీఎం ట్వీట్ చేశారు. దానికి బెంగాల్ రిజెక్ట్స్ అమిత్‌షా అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చారు. విద్యాసాగర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఫోటోను కూడా ట్వీట్‌కు మమత జోడించారు.



అంతకుముందు మమతా బెనర్జీపై అమిత్‌షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేస్తే కరోనా ఎక్స్‌ప్రెస్‌లంటారా? వచ్చే ఎన్నికల్లో తృణమూల్ పార్టీని అదే రైళ్లలో కార్మికులు బయటకు తరలిస్తారు. సీఏఏను వ్యతిరేకించి మమత చాలా పెద్ద తప్పు చేశారు. ఆ ఫలితం కూడా ఆమె చవిచూడబోతున్నారు' అని విమర్శలు గుప్పించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox