Breaking News

రాజ్యాంగం లోని రాముని ఫోటో ఇదే..!

05 th Aug 2020, UTC
రాజ్యాంగం లోని రాముని ఫోటో ఇదే..!

న్యూఢిల్లీ : నేడు అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. యావత్ భారతం లోని హిందువుల కోరిక ఎట్టకేలకు తీరింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఓ అరుదైన ఫోటో ను తన ట్విట్టర్ లో షేర్ చేసారు. రామాలయ నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేసిన నేపధ్యంలో రవి శంకర ప్రసాద్ ఈ ఫోటోను షేర్ చేసారు.
             రాజ్యాంగంలో ని శ్రీ రాముడి ఫోటో ను కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్విట్టర్ లో పంచుకున్నారు. అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో భగవాన్ శ్రీరాముని తరపున సుదీర్ఘ కాలం న్యాయవాదిగా రవిశంకర్ ప్రసాద్ పనిచేశారు. నేడు భూమి పూజ సందర్భం గా ఆయన పంచుకున్న ట్వీట్ లో రాజ్యాంగం లోని అసలు ప్రతిలోని శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు ఫొటోను  పోస్ట్ చేసారు.
             ఈ సందర్భం గా "రావణాసురుడిని ఓడించిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్న శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుల సొగసైన చిత్రం భారత రాజ్యాంగం అసలు దస్తావేజులో ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధ్యాయం ప్రారంభంలో ఈ చిత్రం ఉంది. మీ అందరితో దీనిని పంచుకోవాలని అనిపించింది" అనిఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox