Breaking News

బీజేపీ అగ్రనేతలకు అందని ఆహ్వానం

01 st Aug 2020, UTC
బీజేపీ అగ్రనేతలకు అందని ఆహ్వానం

అయోధ్య : అయోధ్యలో రామమందిరం అంటే అందరికీ గుర్తుకు వచ్చే విషయం రధయాత్ర. బీజేపీ కురువృద్దుడు ఎల్ కే అద్వానీ చేపట్టిన ఈ యాత్ర బీజేపీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడింది.  ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ ఓట్లను ఏకీకృతం చేసింది. అద్వానీ రధయాత్ర చేస్తుండగా బీహార్ లో లాలా సర్కార్ అరెస్ట్ చేయడం తరువాత పరిణామాలలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్ప కూలడం అందరికీ తెలిసిందే. రామ మందిరం ఉద్యమంతో అద్వానీకి ఎంతో అనుబంధం వుంది. బాబ్రీ మసీదు కూలగొట్టిన వివాదంలో అద్వానీ, మరో బీజేపీ సీనియర్ నేత ఎమ్ ఎమ్ జోషీలు  సీబీఐ విచారణ కూడ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఇద్దరికీ ఆగష్టు 5న అయోధ్యలో జరిగే భూమి పూజకు ఆహ్వానం అందలేదు.  అయితే మరో పక్క ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ లకు మాత్రం ఆహ్వానం అందడం గమనార్హం. వీరు కూడ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఇప్పటికే అద్వానీ , జోషిలను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇపుడు అయోధ్యలో కార్యక్రమానికి కూడ వీరికి పిలుపు లేకపోవడం విశేషం.

అయోధ్యలో ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. 

బీజేపీ అగ్రనేతలయిన అద్వానీ, జోషిలకు  ఇప్ప‌టివ‌ర‌కు రూపొందించిన షెడ్యూల్‌లోకానీ, వేదిక‌పై కూర్చొనే ఆహ్వానితుల జాబితాలో కానీ వారి పేర్లు ఎక్క‌డా క‌నిపించలేదు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox