Breaking News

వారిద్దరిని తప్పక ఆహ్వానిస్తాం : అయోధ్య ట్రస్ట్

01 st Aug 2020, UTC

అయోధ్య : రామజన్మ భూమి అయోధ్య ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు ఆహ్వానం అందని సంగతి తెలిసిందే. తాజాగా వారిద్దరికీ తప్పకుండ ఆహ్వానం అందిస్తామని అయోధ్య ట్రస్ట్ కు చెందిన వర్గాలు స్పష్టం చేసాయి. ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. దేశమంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే ఈ పూజ కోసం  ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ లకు ఆహ్వానాలు వెళ్లాయి. కానీ, బీజేపీ లో సీనియర్ నేతలు అయినా అద్వానీ, ఎం.ఎం.జోషీలకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ విషయమై వార్తలు వచ్చాయి. దీనితో పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. ఇతర నేతలను ఇన్వైట్ చేసినట్టుగానే వీరిని కూడా  ఫోన్ ద్వారా తప్పనిసరిగా ఆహ్వానిస్తామని అయోధ్య  ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. రామ జన్మ భూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఆహ్వానాలను సమన్వయము చేస్తున్నారని సమాచారం. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox