ఢిల్లీ ముఖ్యమంత్రికేజ్రీవాల్ ప్రజలకు దూరంగా ఉంటుంటే, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆసుపత్రులు, క్వారంటైన్లకు వెళ్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శనివారంనాడు జరిపిన వర్చువల్ ర్యాలీలో ఢిల్లీ కార్యకర్తలతో స్మృతి ఇరానీ మాట్లాడుతూ, ఢిల్లీ ముఖ్యమంత్రి నాలుగు గోడలు దాటి బయటకు రావడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నారని, అయితే దేశ ఆరోగ్య శాఖ మంత్రి, ఢిల్లీ ఎంపీ హర్షవర్ధన్ మాత్రం ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లను సందర్శిస్తుండటం మనమంతా గర్వించే విషయమని అన్నారు.
ఢిల్లీ నిగంబోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులు క్యూలు కట్టడం నా మనసును కలిచి వేస్తోంది. వారికి నా సంస్థ ద్వారా సహాయ పడేందుకు కచ్చితంగా ముందుకు వస్తానని హామీ ఇస్తున్నాను' అని స్మృతి ఇరానీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు సైతం ప్రజాసేవ కోసమే పని చేయాలని కోరారు. కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరూ ఒక పోరాట యోధుడిలా పనిచేయాలని, దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ కూడా ఇదే విజ్ఞప్తి చేశారని ఆమె గుర్తుచేసారు.
కోవిడ్-19తో తలెత్తిన సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని వర్గాల వారికి ప్రధాని రూ.20 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించారని అన్నారు. పార్లమెంటులో అడుగుపెట్టే ముందు ప్రధాని తన శిరసు వంచి మరీ దేశం కోసం పాటుపడతానని చేసిన ప్రతిజ్ఞను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
కోవిడ్ లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక ప్రత్యేక రైళ్లలో పంపేందుకు కేంద్రం చేసిన ఏర్పాట్లు, వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను వెనక్కి తీసుకునేందుకు తీసుకున్న చర్యలను కూడా స్మృతి ఇరానీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా సంక్షోభ సమయంలో బీజేపీ కార్యకర్తలు 11 కోట్ల మంది ప్రజలకు ఆహారం అందజేశారని కేంద్ర మంత్రి తెలిపారు.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
19 Jan 2021