Breaking News

వ్యవసాయ బిల్లులు గొప్పవే అయితే.. రైతుల కళ్ళలో సంతోషమేది ?

21 st Sep 2020, UTC

హైదరాబాద్ :కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ బిల్లు 2020 పై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు రాజ్య సభలో ఈ బిల్లుని ఆమోదించడానికి వీల్లేదని విపక్ష నాయకులూ నానా రభస చేశారు. వారిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే, ఈ బిల్లులపై చాలామంది సంతోషం వ్యక్తం చేయడం లేదు. తాజాగా, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ కూడా ఈ వ్యవసాయ బిల్లు పై 2020 అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు.

"రాష్ట్ర రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్ట సభలు ఆమోదించినప్పుడు విస్తృత స్థాయిలో సంబరాలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హర్షం వ్యక్తమైందని" కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ బిల్లులు రైతులు నమ్మదగిన నేస్తమని చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు 2020 పై కేటీఆర్ అసహనం వ్యక్తం చేసారు. ఈ బిల్లు అంత గొప్పదే అయితే, ఒక్క రైతు కూడా ఎందుకు సంబరపడట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని ఆయన తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య నూతన వ్యవసాయ బిల్లుని రాజ్యసభ చైర్మన్ ఆమోదించిన సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox