Breaking News

పంజాబ్ లో 12 వ తరగతి విద్యార్దులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు

11 th Aug 2020, UTC

పంజాబ్ : వైరస్ కారణంగా  మార్చి నెలలో లాక్ డౌన్ విధించినప్పటినుంచి  మూతపడిన స్కూళ్లు,కాలేజీలు, యూనివర్శిటీలు ఇంకా తెరచుకోలేదు. పలు పరీక్షల్ని రద్దు చేయగా మరికొన్నింటిని వాయిదా వేశారు. కొన్ని చోట్ల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 
 
ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. అయితే మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 50వేల ఫోన్లను ఇప్పటికే తెప్పించారు.
 
కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే పాఠాలు నిర్వహిస్తున్నందున పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని అందరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోన్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద  ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox