Breaking News

ఢిల్లీ నుంచి లండన్ కు డైరెక్ట్ బస్సు..టికెట్ ధర ఎంతో తెలుసా..?

24 th Aug 2020, UTC

న్యూఢిల్లీ :ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ లండన్, కానీ మనం వింటున్నది నిజమే. భారత రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు ప్రత్యేకంగా బస్సుని ఏర్పాటు చేశారు. మొత్తం 18 దేశాల గుండా 70 రోజులపాటు ఈ ప్రయాణం సాగనుంది. అయితే, ఢిల్లీ నుంచి లండన్ కు ప్రయాణించాలంటే కనీసం ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇది మాములు ప్రయాణం కాదు. సాహసాలతో కూడిన ప్రయాణంగా ఉంటుందట. ఇందుకోసం ‘బస్ టు లండన్’ పేరుతొ ఈ యాత్రను అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ ప్రారంభించిందట.

అయితే, ఈ ట్రిప్ కు ధర ఎంతో తెలుసా? అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు. ఈ యాత్ర మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీద నుంచి ప్రయాణం సాగుతుంది. అయితే, ఈ బస్సులో కేవలం ఇరవై మంది మాత్రమే ప్రయాణించగలరట. ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, సహాయకుడు కూడా ఉంటారు. ఈ బస్సులో వెళ్ళాలి అనుకునే ప్రయాణికులకు వీసా, భోజన, వసతి సదుపాయాల నుంచి అన్నింటినీ ట్రావెల్ సంస్థే చూసుకుంటుంది. ఈ ఏడాది మే 21 న ఈ ప్రయాణం ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రయాణం వాయిదా పడింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox