Breaking News

హై కమాండ్ ఓకే అంటే రెబల్స్ కు వెల్ కమ్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్

01 st Aug 2020, UTC

రాజస్థాన్ : మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఆయన వర్గీయులు తిరిగి పార్టీలోకి రావడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతిస్తే తాము స్వాగతిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. రెబల్స్‌ను స్వాగతిస్తామని, అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని ఆయన చెప్పారు.

జైసల్మేర్‌‌లో శనివారంనాడు మీడియాతో గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో నడుస్తున్న 'తమాషా'కు ప్రధాని ఇప్పటికైనా తెరదించాలని అన్నారు. 'ఇక్కడ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం అంతకంతకూ పెరుగుతోంది. ఇదేం తమాషా?' అని నిలదీశారు

సంజీవనీ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకాషత్ పేరు వెలుగులోకి వచ్చిందని, షెకావత్ ప్రమేయంపై విచారణ జరపాలని రాజస్థాన్ కోర్టు కూడా ఎస్ఓజీని ఆదేశించిందని గెహ్లాట్ చెప్పారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న ఆడియో టేపులో ఆయన గొంతు వినిపిస్తోందని,షెకావత్‌కు ఇంకెంతమాత్రం మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తక్షణం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని గెహ్లాట్ డిమాండ్ చేశారు.  

ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఆహ్వానించడం, తాము హాజరవుతామని పైలట్ చెప్పడంతో రాజస్థాన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox